జేఈఈ మెయిన్స్ పరీక్షలను వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ పరీక్షలు వాయిదా పడిన విషయం విదితమే. కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జాతీయ స్థాయిలో నిర్వహించాల్సిన పరీక్షలన్నింటినీ వాయిదా వేయాలని ఎమ్మాహెచ్‌ఆర్డీ ఆయా బోర్డులను ఆదేశించింది. ఈ మేరకు ఎగ్జామ్స్‌ను వాయిదా వేస్తున్నట్లు ఆయా బోర్డులు ప్రకటించాయి. ఏప్రిల్ 5 నుంచి 11వ తేదీ వరకు జరగాల్సిన మెయిన్స్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. వాయిదా పడ్డ పరీక్షల తేదీలను మార్చి 31 తర్వాత ప్రకటించనున్నారు.
జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా