పట్టణప్రగతిపై రాష్ట్రస్థాయి సదస్సు..

 రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం పట్టణప్రగతి. ఇవాళ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన పట్టణప్రగతి కార్యక్రమంపై రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్లర్లు, మేయర్లు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, మున్సిపల్‌ కమిషనర్లు హాజరవుతారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌.. వారికి పట్టణప్రగతి నిర్వహణపై దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంతో పల్లెల రూపురేఖలే మారిపోయాయి. ప్రతి గ్రామం పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. పల్లెప్రగతి విజయవంతమవడంతో.. అదే స్ఫూర్తితో ప్రభుత్వం.. పట్టణప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.