25 రూపాయిలకే ఉల్లిగడ్డలు అందిస్తున్నాం: ఏపీ మంత్రి
కాకినాడ: రాష్ట్రంలో రైతుబజార్ల ద్వారా పట్టణ వినియోగదారుకు 25 రూపాయిలకే ఉల్లిపాయలు అందిస్తున్నామని మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పుకొచ్చారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్కెట్ స్థిరీకరణ నిధినుండి ఇప్పటివరకూ 14 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉల్లి కొనుగోలు చేశామన్నారు. పల్లెల్లో రేషన్ షాపుల్లో ఇవ్వాలని ఉన్నా..సరుకు దొరకడం లేదన్నారు. ఈ రోజు మహారాష్ట్రలోని షోలాపూర్ మార్కెట్‌లో మన అధికారులు కిలో రూ.115కు కొన్నారని ఆయన తెలిపారు. అంత ధరపెట్టినా ఉల్లి సరిపడా దొరకడం లేదని.. అందువల్ల పల్లె ప్రజలకు ఉల్లి ఇవ్వలేకపోతున్నామని మోపిదేవి తెలిపారు